కరోనా కిట్లలో అవినీతి

ABN , First Publish Date - 2020-06-21T07:26:25+05:30 IST

జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి ఒబడియా మోయోను ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. కరోనా వైద్య పరీక్షల కిట్లు, మందులు, మాస్కులు వంటి వాటి సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టును అధిక ధరలకు ఒక షాడో కంపెనీకి కట్టబెట్టడం ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ...

కరోనా కిట్లలో అవినీతి

  • జింబాబ్వే ఆరోగ్య మంత్రి అరెస్టు


హరారే, జూన్‌ 20: జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి ఒబడియా మోయోను ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. కరోనా వైద్య పరీక్షల కిట్లు, మందులు, మాస్కులు వంటి వాటి సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టును అధిక ధరలకు ఒక షాడో కంపెనీకి కట్టబెట్టడం ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు మోపింది. ఒక్కో మాస్కుకు దాదాపు రూ.2వేలు వెచ్చించారని తెలిపింది. కేసులో కోర్టుకు ఆయన శనివారం హాజరయ్యే అవకాశం ఉంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే 750శాతానికి మించిపోవడం గమనార్హం.


Updated Date - 2020-06-21T07:26:25+05:30 IST