జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తుది దశ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-24T14:30:53+05:30 IST

ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన కరోనా వ్యాక్సిన్ తొలి దశల పరీక్షా ఫలితాలు సానుకూలంగా వచ్చినందున ఇప్పుడు వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడవ, చివరి దశ పరీక్షలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికాకు...

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తుది దశ పరీక్షలు ప్రారంభం

న్యూయార్క్: ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన కరోనా వ్యాక్సిన్ తొలి దశల పరీక్షా ఫలితాలు సానుకూలంగా వచ్చినందున ఇప్పుడు వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడవ, చివరి దశ పరీక్షలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్(ఎన్ఐహెచ్) తెలిపిన సమాచారం ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా 200కు మించిన ప్రాంతాలలో సుమారు 60 వేల మందిపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు జరగనున్నాయి. ప్రపంచంలో కరోనా టీకా రూపకల్పన విషయంలో జాన్సన్ అండ్ జాన్సన్ పదవ సంస్థ. అలాగే అమెరికాలో కరోనాకు టీకాను రూపొందిస్తున్న నాలుగవ సంస్థ. 


2021 నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది. కంపెనీ అధ్యక్షుడు అలెక్స్ గోక్సీ మాట్లాడుతూ ప్రపంచంలోని అందరి జీవితాలను కోవిడ్-19 ఎంతగానో ప్రభావితం చేసిందని, ఈ వైరస్‌ను ఖతం చేసేందుకు మనమంతా మద్దతు పలకాల్సివుందన్నారు. దీనిలో భాగంగానే తమ కంపెనీ టీకా కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిజీస్ డైరెక్టర్ ఆంథనీ ఫౌసీ మాట్లాడుతూ కరోనా మనముందుకొచ్చి ఎనిమిది నెలల గడచిపోయాయని, అమెరికాకు చెందిన నాలుగు కంపెనీలు వ్యాక్సిన్ రూపకల్పనతో మూడవ దశ పరీక్షలకు చేరుకున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ రూపకల్పనలో వైద్య పరిశోధకుల కృషి అమోఘమని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-24T14:30:53+05:30 IST