కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-03-25T21:01:11+05:30 IST

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు.

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ స్కీం కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని కేంద్రమంత్రి జవదేకర్‌ చెప్పారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కరోనా వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయని, భారత్‌లో కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రజలంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు, నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయన్నారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. రూ.2 కే కిలో గోధుమలు అందిస్తామని జవదేకర్‌ తెలిపారు.

Updated Date - 2020-03-25T21:01:11+05:30 IST