20వేల రైల్వే బోగీలలో కరోనా వార్డులు
ABN , First Publish Date - 2020-04-01T08:47:20+05:30 IST
కరోనా వైరస్ బారిన పడిన రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు దేశవ్యాప్తంగా 20వేల రైలు బోగీలను రైల్వేశాఖ ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది.

న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ బారిన పడిన రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు దేశవ్యాప్తంగా 20వేల రైలు బోగీలను రైల్వేశాఖ ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ బోగీల ద్వారా 3.2లక్షల పడకల ఏర్పాటు చేస్తామని తెలిపింది. తొలిదశలో 5వేల బోగీలను ప్రత్యేక కరోనా వార్డులుగా మార్చి, వాటిలో మొత్తం 80వేల పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నది. క్వారంటైన్ సేవలకు కూడా ఇవే బోగీలను ఉపయోగించాలని నిర్ణయించారు. బోగీల్లో ఉండే ఇండియన్ టాయిలెట్‌ను బాత్రూమ్‌గా మార్చనున్నారు. ఏపీ, తెలంగాణలో 600 పైచిలుకు బోగీల్లో.. బోగీకి 16 పడకల వంతున ఏర్పాటు చేస్తున్నారు.