స్వాబ్‌ టెస్ట్‌లపై సందేహాలు

ABN , First Publish Date - 2020-04-01T06:04:37+05:30 IST

చైనాలో కరోనా చికిత్సకు సంబంధించి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా పాజిటివ్‌, నెగటివ్‌ లక్షణాలను నిర్థారించడానికి ప్రపంచవ్యాప్తంగా స్వాబ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు.

స్వాబ్‌ టెస్ట్‌లపై సందేహాలు

బీజింగ్‌, మార్చి 31: చైనాలో కరోనా చికిత్సకు సంబంధించి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా పాజిటివ్‌, నెగటివ్‌ లక్షణాలను నిర్థారించడానికి ప్రపంచవ్యాప్తంగా స్వాబ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. వ్యాధి సోకినవారికి చికిత్స అనంతరం స్వాబ్‌ పరీక్షలో నెగటివ్‌ వస్తే వ్యాధి నయమైనట్టు భావిస్తున్నారు. అయితే తాజా పరిశోధనల్లో ఇలాంటి రోగుల కఫం, మలంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ లక్షణాలు బయటపడినట్టు తేలింది. చైనాలోని ఆనాల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌ ఈ అంశాలను ప్రచురించారు. దీనివల్ల స్వాబ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వస్తే వ్యాధి పూర్తిగా నయమైనట్టు భావించవచ్చా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. స్వాబ్‌ టెస్ట్‌లో నెగటివ్‌, ఇతర శరీర భాగాల్లో చేసిన పరీక్షలు పాజిటివ్‌ వస్తే, అలాంటి వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవేవీ పూర్తి స్థాయి నిర్థారణలు కాకపోయినప్పటికీ వైర్‌సను మరింతలోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2020-04-01T06:04:37+05:30 IST