రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా కలకలం... అరగంటపాటు ట్రైన్ నిలిపివేసి...
ABN , First Publish Date - 2020-03-16T13:25:04+05:30 IST
హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా వైరస్ వదంతులు వ్యాపించిన నేపధ్యంలో కలకలం చెలరేగింది. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
పట్నా: హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా వైరస్ వదంతులు వ్యాపించిన నేపధ్యంలో కలకలం చెలరేగింది. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఎ-5 కోచ్‌లో సీటు నంబరు 8, 10లలో ఇద్దరు రష్యా పౌరులు ప్రయాణిస్తున్నారు. కొంతమంది తోటి ప్రయాణికులు వారిని కరోనా బాధితులుగా అనుమానిస్తూ, హంగామా చేశారు. దీంతో ఆ రైలు పట్నా స్టేషన్‌లో 30 నిముషాల పాటు నిలిచిపోయింది. కాగా రైలులో కరోనా బాధితులున్నారన్న వార్త తెలియగానే మెడికల్ టీమ్ వారి వద్దకు చేరుకుంది. వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడగా, ఎటువంటి వ్యాధులు లేవని నిర్థారణ అయ్యింది. దీంతో రైలు ముందుకు కదిలింది. ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ రైలులోని ప్రయాణికులు రష్యా పౌరులను చూసి, వారిని కరోనా బాధితులుగా భావించారని, అయితే వైద్య పరీక్షల అనంతరం అది నిజం కాదని తేలిందని అన్నారు.