వైద్యసిబ్బందికి రక్షణ పరికరాలేవీ?: ప్రియాంక

ABN , First Publish Date - 2020-04-05T07:45:45+05:30 IST

కరోనా వైర్‌సతో పోరాడుతున్న నర్సులు, వైద్యసిబ్బందికి తగిన రక్షణ పరికరాలు లేవని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని...

వైద్యసిబ్బందికి రక్షణ పరికరాలేవీ?: ప్రియాంక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: కరోనా వైర్‌సతో పోరాడుతున్న నర్సులు, వైద్యసిబ్బందికి తగిన రక్షణ పరికరాలు లేవని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని  కేంద్రప్రభుత్వానికి సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫలితాలు రాబట్టాలంటే పెద్దఎత్తున కొవిడ్‌ పరీక్షలు చేపట్టడం దేశానికి అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన వైద్యసదుపాయాలు పెంచాలని, దీనిపై తక్షణమే ప్రభుత్వం కదలాలని సూచించారు. కాగా, కరోనా పోరులో రాష్ట్రాలకు మరింత ఆర్థిక దన్ను అందించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనటే కేంద్రాన్ని కోరారు. వనరులు కల్పించినప్పుడే రాష్ట్రాలు ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోగలవన్నారు. రాష్ట్రాలకు లక్ష కోట్లు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.42 వేల కోట్ల జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-05T07:45:45+05:30 IST