తబ్లిగీకి వెళ్లిన వ్యక్తి.. ఆస్పత్రి నుంచి పరార్..
ABN , First Publish Date - 2020-04-07T19:08:55+05:30 IST
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన ఓ 60 సంవత్సరాల కరోనా పాజిటివ్ రోగి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రి నుంచి

లక్నో: ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన ఓ 60 సంవత్సరాల కరోనా పాజిటివ్ రోగి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రి నుంచి పారిపోయిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి తన బట్టలను తాడుగా తయారు చేశాడు.. ఆ తర్వాత వార్డు కిటికి అద్దం బద్దలుకొట్టి ఆ తాడు సహాయంతో కిందకు దిగి.. అక్కడి నుంచి పారిపోయాడు.
నేపాల్ నుంచి తబ్లిగీ వచ్చిన 17 మంది సభ్యులలో ఇతను ఒకడు. శుక్రవారం బాఘ్‌పట్‌లో ప్రభుత్వాస్పత్రిలో చేరిన అతనికి ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతను అందరితోనూ మంచిగా ప్రవర్తించేవాడని, ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే టండన్ తెలిపారు. అతని కోసం సమీప గ్రామాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు.