అది నోయిడా ధారావి... క‌రోనా వ్యాప్తిని ఎలా కంట్రోల్ చేశారంటే...

ABN , First Publish Date - 2020-07-22T17:00:04+05:30 IST

యూపీలోని నోయిడాకు చెందిన జెజె కాలనీ స్లమ్ క్లస్టర్... సెక్టార్ 5, 8, 9,10ల‌లో ఉంది. జూన్ 30 నాటికి ఈ క్లస్టర్‌లో మొత్తం 90 క‌రోనా కేసులు నమోదయ్యాయి. సెక్టార్ 8లో వీటిలో స‌గం పాజిటివ్ కేసులు ఉన్నాయి.

అది నోయిడా ధారావి... క‌రోనా వ్యాప్తిని ఎలా కంట్రోల్ చేశారంటే...

నోయిడా: యూపీలోని నోయిడాకు చెందిన జెజె కాలనీ స్లమ్ క్లస్టర్... సెక్టార్ 5, 8, 9,10ల‌లో ఉంది. జూన్ 30 నాటికి ఈ క్లస్టర్‌లో మొత్తం 90 క‌రోనా కేసులు నమోదయ్యాయి. సెక్టార్ 8లో వీటిలో స‌గం పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ క్లస్టర్‌లో కరోనా విప‌రీత వ్యాప్తిని గ‌మ‌నించిన వైద్య అధికారులు దీనిని ముంబైలోని ధారవితో పోల్చారు. జెజె కాలనీ స్లమ్ క్లస్టర్‌ను నోయిడాకు చెందిన ధారవి అని కూడా స్థానికులు పిలుస్తుంటారు. అయితే జెజె కాలనీ క్లస్టర్‌లో జూలై నెలలో క‌రోనా నుంచి ఉపశమనం కలిగించే వార్తలు వెలువ‌డ్డాయి. ఈ క్లస్టర్ నుంచి జూలైలో ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాలేదు. దీనివెనుక అధికారుల కృషి దాగివుంది. ఈ సంద‌ర్భంగా నోడల్ అధికారి నరేంద్ర భూషణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తిని  నియంత్రించేందుకు ప్ర‌తిరోజూ నాలుగు వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అదేవిధంగా జూలై 2 నుంచి 12 వరకు క‌రోనాపై అవ‌గాహ‌న కోసం ప్రచారం నిర్వహించారు. సామాజిక దూరం పాటించ‌డం, మాస్కులు ధరించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం మొద‌లైన‌వాటి ప్రాధాన్య‌త గురించి స్థానికుల‌కు వైద్యాధికారులు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించారు. 1500 మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల బృందాలు జెజె కాలనీ స్లమ్ క్లస్టర్‌లో వైద్య సేవ‌లు అందించారు. త‌ద్వారా ఈ ప్రాంతంలో క‌రోనా క‌ట్ట‌డి జ‌రిగింద‌ని నరేంద్ర భూషణ్ తెలిపారు.

Updated Date - 2020-07-22T17:00:04+05:30 IST