హిమాచ‌ల్‌లో ఒకేరోజు నాలుగు పాజిటివ్ కేసులు... మొత్తం 50కి చేరిక‌!

ABN , First Publish Date - 2020-05-09T17:49:31+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్త‌రిస్తోంది. చంబాలోని సలుణీ ప్రాంతానికి చెందిన‌ కరోనా పాజిటివ్ రోగికి చెందిన రెండేళ్ల కుమార్తెతో...

హిమాచ‌ల్‌లో ఒకేరోజు నాలుగు పాజిటివ్ కేసులు... మొత్తం 50కి చేరిక‌!

చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్త‌రిస్తోంది. చంబాలోని సలుణీ ప్రాంతానికి చెందిన‌ కరోనా పాజిటివ్ రోగికి చెందిన రెండేళ్ల కుమార్తెతో సహా నలుగురికి వైర‌స్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైర‌స్ కార‌ణంగా ఇద్దరు మృతి చెందారు. 35 మంది కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 18488 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో 7110 మంది క్వారంటైన్‌లో 28 రోజులు పూర్తి చేసుకున్నారు. వీరంతా  ఆరోగ్యంగానే ఉన్నారు. 

Updated Date - 2020-05-09T17:49:31+05:30 IST