మరోమారు చైనాపై కరోనా దాడి?... హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2020-04-01T15:16:26+05:30 IST
చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నగరాలు లాక్ డౌన్ నుండి విముక్తి పొందుతున్నాయి. సుమారు 60 రోజుల తరువాత అడ్డంకులు తొలగుతున్నాయి.అయితే వైద్య శాస్త్రవేత్తల....

బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నగరాలు లాక్ డౌన్ నుండి విముక్తి పొందుతున్నాయి. సుమారు 60 రోజుల తరువాత అడ్డంకులు తొలగుతున్నాయి.అయితే వైద్య శాస్త్రవేత్తల ముందు మరో పెద్ద సవాలు నిలిచింది. ఈ సందర్భంగా హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయ ఎపిడెమియాలజిస్ట్ బెల్ కౌలింగ్ మాట్లాడుతూ లాక్ డౌన్ నుండి బయటపడటానికి, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరికింది. అయితే కరోనా వైరస్ మరోమారు దాడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి కరోనా దాడి జరిగే అవకాశం ఉంది. కరోనా వైరస్ తొలుత ఉహాన్ నుండి చైనాకు, ఆ తరువాత యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాకు వ్యాపించిందని బెన్ కౌలింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించింది. సరిహద్దులు మూసివేశారు. కరోనా రోగులను మిగిలిన వారి నుండి సుమారు రెండేళ్లపాటు వేరుగా ఉంచాల్సి ఉంటుందని బెన్ కౌలింగ్ సూచిస్తున్నారు. అప్పుడే ఆయా దేశాలు తమ ప్రజలను రక్షించగలవనిచెబుతున్నారు. కరోనా వైరస్ బారిన ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి చైనా మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించాలని బెన్ సూచించారు.