బ‌యోకాన్ చైర్‌ప‌ర్స‌న్ కిరణ్ మజుందార్ షాకు క‌రోనా పాజిటివ్‌‌

ABN , First Publish Date - 2020-08-18T10:53:03+05:30 IST

పద్మశ్రీ, పద్మ భూషణ్ పుర‌స్కార గ్ర‌హీత కిరణ్ మజుందార్ షా కరోనా బారిన ప‌డ్డారు. బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ అయిన కిరణ్ మజుందార్ ఒక ట్వీట్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. త‌న కరోనా రిపోర్టు...

బ‌యోకాన్ చైర్‌ప‌ర్స‌న్ కిరణ్ మజుందార్ షాకు క‌రోనా పాజిటివ్‌‌

న్యూఢిల్లీ: పద్మశ్రీ, పద్మ భూషణ్ పుర‌స్కార గ్ర‌హీత కిరణ్ మజుందార్ షా కరోనా బారిన ప‌డ్డారు. బయోకాన్ లిమిటెడ్ చైర్ పర్సన్ అయిన కిరణ్ మజుందార్ ఒక ట్వీట్‌లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. త‌న కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌న‌కు తేలికపాటి క‌రోనా లక్షణాలున్నాయ‌ని తెలిపారు. కిరణ్ మజుందార్ షా ఒక మహిళా పారిశ్రామికవేత్తగా పేరుగాంచారు. ఆమె బయోకాన్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీని ప్రారంభించారు. కాగా క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో రష్యా ప్రపంచంలోనే మొదటిది కాద‌ని కిరణ్ మజుందార్ షా ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ర‌ష్యా తొలి సేఫ్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆమె త‌ప్పుపట్టారు. ఫేజ్ వ‌న్‌, టూ ట్రయల్స్ చూడలేదు. అలాగే ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ లాంచ్ చేయడం రష్యాకు ఆమోదయోగ్యమైతే అంతవరకే  ఉండనివ్వాల‌న్నారు.

Updated Date - 2020-08-18T10:53:03+05:30 IST