కరోనా: భిన్న వ్యూహాల వల్ల భారీ మూల్యం చెల్లిస్తున్నామన్న ఐక్యరాజ్యసమితి

ABN , First Publish Date - 2020-05-19T01:00:08+05:30 IST

కరోనా మహమ్మారి ఓ మేలుకొపులు లాంటిదని, ప్రపంచ దేశాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు.

కరోనా: భిన్న వ్యూహాల వల్ల భారీ మూల్యం చెల్లిస్తున్నామన్న ఐక్యరాజ్యసమితి

జెనీవా: కరోనా మహమ్మారి ఓ మేలుకొపులు లాంటిదని, ప్రపంచ దేశాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు. కరోనాను అతి పెద్ద సవాలుగా అభివర్ణించిన ఆయన.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ దేశాల బలహీనత బయటపడిందన్నారు. ఆరోగ్య వ్యవస్థలలోని లోపాలే కాకుండా అంతర్జాతీయ వ్యవస్థలు, సైబర్ రక్షణ వ్యవస్థలు వంటి బిన్నరంగాల లోటుపాట్లు వెల్లడయ్యాయన్నారు.


‘మనకు కరోనా ఓ  మేలుకొలపు లాంటిది. ఈ చెత్తను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. కరోనా కట్టడికి ఒకో దేశం ఒక్కో వ్యూహాన్ని అనుసరించాయి. ఇందులో కొన్ని పరస్పర విరుద్ధమైనవి కూడా. దీని వల్ల మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలనున అనేక దేశాలు పట్టించుకోలేదు. దీంతో వైరస్ ప్రపంచమంతా పాకింది. ప్రపంచ దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని పాటించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.  Updated Date - 2020-05-19T01:00:08+05:30 IST