9 ఏళ్లలోపు పిల్లల్లో కరోనా తీవ్రత తక్కువ

ABN , First Publish Date - 2020-04-24T07:32:46+05:30 IST

కరోనా సోకిన అధికశాతం పిల్లల్లో రోగ లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, కొద్దిపాటి సంరక్షణ జాగ్రత్తలు తీసుకుంటే.. వీళ్లు ఒకటి నుంచి రెండు వారాల్లోపే పూర్తిగా కొలుకునే

9 ఏళ్లలోపు పిల్లల్లో కరోనా తీవ్రత తక్కువ

లండన్‌, ఏప్రిల్‌ 23: కరోనా సోకిన అధికశాతం పిల్లల్లో రోగ లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, కొద్దిపాటి సంరక్షణ జాగ్రత్తలు తీసుకుంటే.. వీళ్లు ఒకటి నుంచి రెండు వారాల్లోపే పూర్తిగా కొలుకునే అవకాశాలుంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల్లో రోగ తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదంది. చైనా, సింగపూర్‌లోని కరోనా వైరస్‌ సోకిన 1,065 మంది పిల్లలపై జరిగిన 18 అధ్యయనాలను పరిశీలించిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చింది. అక్కడ 9 ఏళ్ల లోపు పిల్లల్లో ఒక్క మరణమూ నమో దు కాలేదని, దీనికి కారణం చికిత్స, సంరక్షణ జాగ్రత్తలేనని తెలిపింది.  

Updated Date - 2020-04-24T07:32:46+05:30 IST