రోగులకు వాట్సాప్ ద్వార టెలీ మెడిసిన్ సేవలు

ABN , First Publish Date - 2020-03-30T17:47:02+05:30 IST

మంగుళూరు నగరంలోని ఓ ఆసుపత్రి వాట్పాప్ ద్వార టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది....

రోగులకు వాట్సాప్ ద్వార టెలీ మెడిసిన్ సేవలు

మంగళూరు (కర్ణాటక): దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న ప్రస్థుత ఆపత్కాలంలో రోగులకు వైద్యసేవలందించేందుకు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరంలోని ఓ ఆసుపత్రి వాట్పాప్ ద్వార టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది. మంగళూరులోని డేరలకట్టే ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రి ప్రత్యేకంగా వాట్సాప్ సాయంతో రోగులకు టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించింది. లాక్ డౌన్ సమయంలో రోగులు వాట్సాప్ లోనే వైద్యుల నుంచి వైద్యసలహాలు పొందవచ్చు.కరోనా మహమ్మారి కారణంగా ఈ టెలీమెడిసిన్ సేవలు ప్రారంభించామని వైద్యులు చెప్పారు. ఒక్క ఆదివారం నాడే 300 మందికి పైగా రోగులు టెలీమెడిసిన్ సేవలు పొందారని మంగళూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ హిరేమత్ చెప్పారు.

Updated Date - 2020-03-30T17:47:02+05:30 IST