అందమైన దేశంలో వందల మృతదేహాలు... కేర్ హోమ్స్‌కు వృద్ధులు!

ABN , First Publish Date - 2020-03-24T15:56:33+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటైన స్పెయిన్ ఇప్పుడు కరోనా వైరస్ బారినపడి విలవిలలాడిపోతోంది. ఇప్పటివరకూ స్పెయిన్‌లో కరోనా వైరస్ కారణంగా 2 వేల మంది మృతి చెందారు. 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం ...

అందమైన దేశంలో వందల మృతదేహాలు... కేర్ హోమ్స్‌కు వృద్ధులు!

మాడ్రిడ్: ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటైన స్పెయిన్ ఇప్పుడు కరోనా వైరస్ బారినపడి విలవిలలాడిపోతోంది. ఇప్పటివరకూ స్పెయిన్‌లో కరోనా వైరస్ కారణంగా 2 వేల మంది మృతి చెందారు. 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం ఒక్కరోజే కరోనా వ్యాధి కారణంగా 462 మంది మృతి చెందారు. 


ఈ నేపధ్యంలో పలు మృతదేహాలు ఇళ్లలోనే పడివుండగా, వాటిని తొలగించేందుకు సైన్యం సహాయాన్ని అందిస్తోంది. మరోవైపు ఇక్కడి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను కేర్ హోమ్స్‌లో వదిలివేస్తున్నారు. చైనా, ఇటలీల తరువాత స్పెయిన్ కరోనా వైరస్ కారణంగా తల్లడిల్లిపోతోంది. మార్చి 14 నుంచి స్పెయిన్‌లో లాక్‌డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2020-03-24T15:56:33+05:30 IST