ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు..
ABN , First Publish Date - 2020-04-26T02:29:45+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు..

న్యూఢిల్లీ: డిసెంబర్ నెలలో చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 197,303 మంది మృతి చెందారు. శనివారం సాయంత్రం వరకు ప్రస్తుతం 193 దేశాల్లో 2,821,030 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం అందినట్లు ఏఎఫ్ పీ పేర్కొంది. కరోనా నుంచి 766,300 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.