దేశంలో తొలిసారి ఒక్కరోజులో 50 వేలు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు!

ABN , First Publish Date - 2020-07-27T12:29:34+05:30 IST

దేశంలో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో తొలిసారిగా ఆదివారం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో తొలిసారి ఒక్కరోజులో 50 వేలు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో తొలిసారిగా ఆదివారం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,34,476 కు పెరిగింది. కాగా ఈ అంటువ్యాధి నుండి కోలుకుంటున్న బాధితులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందనేది ఉపశమనం కలిగించే అంశంగా మారింది. దేశంలో కరోనా వైరస్ రిక‌వ‌రీ రేటు 63.9 శాతంగా ఉంది. ఆదివారం నాటికి మొత్తం 9,16,505 మంది బాధితులు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ అంటువ్యాధి బారిన‌ప‌డి ఇప్పటివరకు 32,811 మందిని మృతిచెందారు. మహారాష్ట్రలో కొత్త‌గా 9,431 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే మ‌హారాష్ట్ర‌లో 3,75,799 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ వైరస్ మ‌హారాష్ట్ర‌లో మరో 267 మంది ప్రాణాలు తీసుకుందని, రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,656 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ తెలిపింది. ఇక ఢిల్లీలో గ‌త కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. ఈ ధోరణి ఆదివారం కూడా కొనసాగింది. కొత్తగా 1075 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

Updated Date - 2020-07-27T12:29:34+05:30 IST