24 గంటల్లో రెండు టెస్టులు నెగిటివ్ వస్తేనే...

ABN , First Publish Date - 2020-03-16T14:38:48+05:30 IST

దేశవ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మంది చికిత్స పొందిన అనంతరం కోలుకోగా, వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. అయితే కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స...

24 గంటల్లో రెండు టెస్టులు నెగిటివ్ వస్తేనే...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మంది చికిత్స పొందిన అనంతరం కోలుకోగా, వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. అయితే కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స తీసుకున్నాక పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని ఎలా నిర్ధారిస్తానే ప్రశ్న అందరిలో కలుగుతుంది. దీనిపై ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు డిశ్చార్జి పాలసీని విడుదల చేసింది. ఈ విధానంలో 24 గంటల్లో రెండుసార్లు బాధితుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షిస్తారు. ఆ రెండుసార్లూ నెగిటివ్ రిపోర్టు వస్తేనే సదరు బాధితుడని డిశ్చార్జి  చేస్తారు.  ఈ శాంపిళ్ల టెస్ట్‌తో పాటు చెస్ట్ రేడియోగ్రఫీ కూడా చేస్తారు. దీని ద్వారా బాధితుడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడా లేదా అనేది తెలుసుకుంటారు. ఈ విధమైన పరీక్షల అనంతరం రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు.



Updated Date - 2020-03-16T14:38:48+05:30 IST