రెండు వారాల్లో 8 మందికి!

ABN , First Publish Date - 2020-04-05T07:18:21+05:30 IST

ముంబైకి చెందిన యువడాక్టర్‌ మార్చిలో లండన్‌కు వెళ్లొచ్చి తాతకు కరోనా వైరస్‌ అంటించారు. డాక్టర్‌ అయిన తండ్రికీ అంటించారు. ఆస్పత్రిలో వైద్యం చేసి మరో ఇద్దరికి అంటించారు.

రెండు వారాల్లో 8 మందికి!

కరోనా చైన్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందంటే?


ముంబైకి చెందిన యువడాక్టర్‌ మార్చిలో లండన్‌కు వెళ్లొచ్చి తాతకు కరోనా వైరస్‌ అంటించారు. డాక్టర్‌ అయిన తండ్రికీ అంటించారు. ఆస్పత్రిలో వైద్యం చేసి మరో ఇద్దరికి అంటించారు. యువ డాక్టర్‌ తల్లి, నాన్నమ్మలకూ పాజిటివ్‌ అని తేలింది. తాత చనిపోయారు. భౌతికదూరం ప్రాముఖ్యాన్ని చెప్పే ఉదంతమిది. 


మార్చి రెండో వారం 

ముంబై డాక్టర్‌ బ్రిటన్‌ నుంచి వెనక్కి వచ్చారు. 

కరోనా పాజిటివ్‌: 0 


మార్చి 23: డాక్టర్‌ తాత కూడా డాక్టరే. యూరాలజిస్టు. 85 ఏళ్లు. మనుమడు విదేశాల నుంచి వచ్చాక తాత కు ఊపిరి పీల్చడం కష్టంగా మారింది. దక్షిణ ముంబైలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీటీ స్కాన్‌ తీయగా ఊపిరితిత్తుల్లో తేడా ఉందని తేలింది. కరోనా వైరస్‌ ఉందని అనుమానించారు. మనుమడు ఇటీవలే లండన్‌ నుంచి వచ్చాడని ధ్రువీకరణ కాగానే ఇద్దరికీ కరోనా వైరస్‌ పరీక్షలు చేశారు. 

కరోనా పాజిటివ్‌: 0


మార్చి 25: తాతకు, మనుమడికి ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. మనుమడు బ్రిటన్‌లో కరోనా అంటించుకొని వచ్చి తాతకు తగిలించారు. మార్చి 26న తాత గుండెపోటుతో చనిపోయారు. 

కరోనా పాజిటివ్‌: 2


మార్చి 27: యువ డాక్టర్‌ తండ్రి హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణుడు. ఆయనకూ పాజిటివ్‌ వచ్చింది. హిందూ జా ఆసుపత్రిలో చేర్చారు. తనయుడు విదేశాల నుంచి వచ్చాక తాను 40 మంది పేషంట్లకు సేవ లందించానని తండ్రి వెల్లడించారు. అందులో ఐదుగురికి ఆపరేషన్‌ కూడా చేసినట్లు చెప్పారు. వారిలో 14 మందిని హైరిస్క్‌ గ్రూప్‌గా తేల్చి పరీక్షిస్తున్నారు. 

కరోనా పాజిటివ్‌: 3


మార్చి 28: సీనియర్‌ డాక్టర్‌తో కాంటాక్టులోకి వచ్చిన 40 మంది పేషంట్లను పరీక్షించారు. ఆయన పనిచేసే ఆస్పత్రి ఆపరేషన్‌, సర్జికల్స్‌ విభాగాలను మూ సేశారు. కొత్త పేషంట్లను చేర్చుకోరాదన్నారు. 

కరోనా పాజిటివ్‌: 3 


మార్చి 30: హాస్పిటల్‌ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది

కరోనా పాజిటివ్‌: 4


ఏప్రిల్‌ 1: హృద్రోగ డాక్టర్‌ తల్లికి, భార్యకు పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్ల కుటుంబం నివసించే భవనాన్ని సీల్‌ చేశారు. 

కరోనా పాజిటివ్‌: 6


ఏప్రిల్‌ 2: హృద్రోగ నిపుణుడి క్లినిక్‌లో వాచ్‌మన్‌, టెక్నీషియన్లకు పాజిటివ్‌ వచ్చింది. వారి కుటుంబాలను క్వారంటైన్‌ చేశారు. క్లీనిక్‌ ఉన్న భవనాన్ని సీల్‌ చేశారు.

కరోనా పాజిటివ్‌: 8

Updated Date - 2020-04-05T07:18:21+05:30 IST