కరోనా వైరస్‌కి కారణం ఏలియన్సా !
ABN , First Publish Date - 2020-04-29T20:38:05+05:30 IST
ఏలియన్స్‌కి కరోనా వస్తుందా?
ఏలియన్స్‌కి కరోనా వస్తుందా? కరోనాకు ఏలియన్స్ మందు తీసుకువస్తారా? యూఎఫ్‌వోలు నిజమేనని పెంటగాన్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో హోరెత్తున్న ప్రశ్నలివి. కొందరైతే కరోనా వైరస్‌ను తీసుకొచ్చింది కూడా ఏలియన్సేమోనన్న అనుమానంలో ఉన్నారు. నిజానికి యూఎఫ్‌వోలు నిజామా? అబద్దమా? ప్లైయింగ్ సాసర్లని చాలా రకాలుగా చెప్పుకున్నాం. అందులో ఎవరు వస్తారో? ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఇప్పుడు పెంటగాన్ స్వయంగా ప్రకటించడంతో యూఎఫ్‌వోలు నిజమే అంటే.. ఏలియన్స్ నిజమే అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
యూఎఫ్‌వోలు కనిపించాయి అనేసరికి కరోనాకు లింకు పెడుతున్నారు. ఏలియన్స్‌కు కరోనా వస్తుందా? అన్నది ఓ నెటిజన్ డౌట్. కరోనాకు ఏలియన్స్ మందు తీసుకువస్తారా? అంటూ మరో నెటిజన్ అనుమానం. ఇలాంటివాటన్నింటికి సోషల్ మీడియానే వేదిక కదా. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు హోరెత్తుతున్నాయి.