ఇండియాలో 433కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-03-23T21:45:54+05:30 IST

దేశం మొత్తంలో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. కొత్తగా 15 కేసులతో మొత్తం 89 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. ఇక తర్వాతి స్థానంలో కేరళ ఉంది. కేరళలో ఇప్పటి వరకు 67 కేసులు నమోదు అయ్యాయి

ఇండియాలో 433కి చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా (కోవిడ్-19) కేసులు పెరిగిపోయాయి. చూస్తుండగానే నాలుగు శతకాలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నమోదైన 3 కేసులతో సోమవారం మధ్యాహ్నానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 433కు చేరుకుంది. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు ఈ లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.


దేశం మొత్తంలో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. కొత్తగా 15 కేసులతో మొత్తం 89 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. ఇక తర్వాతి స్థానంలో కేరళ ఉంది. కేరళలో ఇప్పటి వరకు 67 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ 26, ఉత్తరప్రదేశ్ 29, తెలంగాణ 33, రాజస్తాన్, 27, హర్యానా 23, కర్ణాటక 26 కేసులు నమోదు అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ఆదివారం ఒక్క రోజే దేశంలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే దేశంలో 80 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-23T21:45:54+05:30 IST