కరోనా వైరస్‌‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా రిపోర్ట్ ఇదీ..

ABN , First Publish Date - 2020-03-04T13:41:24+05:30 IST

చైనా వెలుపల కొత్తగా మరో 1700 పైగా నోవెల్ కరోనావైరస్ (కొవిడ్-19) కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ...

కరోనా వైరస్‌‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా రిపోర్ట్ ఇదీ..

జెనీవా: చైనా వెలుపల కొత్తగా మరో 1700 పైగా నోవెల్ కరోనావైరస్ (కొవిడ్-19) కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. దీంతో చైనాయేతర దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 వేలు దాటింది. చైనాకి వెలుపల మొత్తం 72 దేశాల్లో 1,792 కొత్త కేసులు నమోదయ్యాయనీ.. దీంతో బాధితుల సంఖ్య ప్రస్తుతం 10,566కు చేరిందని కరోనావైరస్‌పై వెలువరించిన తాజా నివేదికలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కాగా చైనా వెలుపల ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 37 నుంచి ఏకంగా 166కు చేరినట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇక ఈ వైరస్‌కు కేంద్ర స్థానమైన చైనాలో ప్రస్తుతం బాధితుల సంఖ్య 80,304గా ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మృతుల సంఖ్య 2,946కు చేరినట్టు తెలిపింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా  కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 1922 నుంచి 90,870కి చేరింది. 

Updated Date - 2020-03-04T13:41:24+05:30 IST