రాజస్థాన్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 3600 దాటిన కేసులు..

ABN , First Publish Date - 2020-05-09T20:19:07+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ మరింత విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా మరో..

రాజస్థాన్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 3600 దాటిన కేసులు..

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ మరింత విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా మరో 57 మందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,636కు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఉదయ్‌పూర్‌లోనే అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. 15 కేసులతో తర్వాతి స్థానంలో జైపూర్ ఉంది. కాగా అజ్మీర్‌లో 11, పాలిలో 3, రాజ్‌సమంద్, చురూల్లో రెండేసి చొప్పున కరోనా కేసులు నమోదు కాగా.. కోల, బర్మర్, జాలోర్, దౌసాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి బారిన పడినట్టు గుర్తించారు. కొవిడ్-19 కారణంగా రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-05-09T20:19:07+05:30 IST