ముంబైలో 70 వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-26T03:45:32+05:30 IST
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే...

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 1,365 మందికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో గుర్తించారు. గడచిన 24 గంటల్లో మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి ముంబైలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 70 వేలు దాటగా.. మృతుల సంఖ్య 4 వేలు దాటినట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ముంబైలో 70,990 మంది కొవిడ్-19 పాజిటివ్ కేసులు రాగా.. 4,060 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 2,141 మంది కొవిడ్ పేషెంట్లు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,151కి చేరిందని బీఎంసీ తెలిపింది. ప్రస్తుతం నగరంలో మొత్తం 27,779 మంది కొవిడ్-19 పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.