అక్కడ కరోనాకు చోటులేదు... అది ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతం!

ABN , First Publish Date - 2020-03-19T15:43:43+05:30 IST

ప్రపంచంలోని 164 దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన 2 లక్షల మంది అనారోగ్యం పాలవగా, 8 వేలకు మించిన జనం మృత్యువాత పడ్డారు.

అక్కడ కరోనాకు చోటులేదు... అది ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతం!

న్యూఢిల్లీ: ప్రపంచంలోని 164 దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన 2 లక్షల మంది అనారోగ్యం పాలవగా, 8 వేలకు మించిన జనం మృత్యువాత పడ్డారు. అయితే ప్రపంచంలోని ఒక ప్రాంతంలో ఇటువంటి వైరస్‌ల ప్రవేశానికి ఆస్కారం లేదు. అలాగే  ఏ వ్యాధికూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశంలేదు. ఎందుకంటే అక్కడ హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నేళ్ల తరబడి అత్యుత్తమంగా కొనసాగుతోంది. అమెరికా అంతరిక్ష కేంద్రం(నాసా) చెప్పినదాని ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యంత సురక్షిత ప్రదేశం. ఇన్నేళ్లలో ఇక్కడ ఒక వ్యక్తికి ఒక్కసారి మాత్రమే జలుబు వచ్చింది. అదికూడా 52 ఏళ్ల క్రితం. ఆ ప్రదేశం పేరు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్). అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్‌ను పంపించేముందు నాసా శాస్త్రవేత్తలు సంబంధిత వ్యక్తికి 10 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నాసా రాబోయే మేలో స్పేస్- ఎక్స్‌కు చెందిన రాకెట్ నుంచి అంతరిక్ష యాత్రికులను స్పేస్ స్టేషన్‌కు పంపించనుంది. నాసా తన స్పేస్ స్టేషన్‌ను అత్యంత సురక్షితంగా ఉంచేందుకు హెల్త్ స్టెబిలైజేషన్ స్టిస్టమ్ టెక్నాలజీని వినియోగిస్తుంటుంది.  


Updated Date - 2020-03-19T15:43:43+05:30 IST