పరారీలో అనంతపురం వ్యక్తి

ABN , First Publish Date - 2020-03-18T07:05:51+05:30 IST

కరోనా అనుమానిత లక్షణాలతో బెంగళూరులోని ఒక ఆస్పత్రి క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి.. వైద్యపరీక్షల ఫలితాలు రాకముందే అక్కణ్నుంచీ పరారయ్యాడు!

పరారీలో అనంతపురం వ్యక్తి

బెంగళూరు: కరోనా అనుమానిత లక్షణాలతో బెంగళూరులోని ఒక ఆస్పత్రి క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి.. వైద్యపరీక్షల ఫలితాలు రాకముందే అక్కణ్నుంచీ పరారయ్యాడు! అధికారులు అతడు ఇచ్చిన చిరునామాను పరిశీలించగా.. ఏపీలోని అనంతపురం వ్యక్తిగా తేలింది!! అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఆయన్ను.. విమానాశ్రయంలో పరీక్షించిన అధికారులు ‘కేటగిరీ బి (ఆస్పత్రి క్వారంటైన్‌ అవసరం)’గా నమోదు చేసి ఆస్పత్రికి పంపారు. వైద్యులు ఆయనకు ప్రాథమిక పరీక్షలు చేసి క్వారంటైన్‌లో ఉంచారు. వైరస్‌ నిర్ధారణ నిమిత్తం అతడి నమూనాలను పరీక్షకు పంపారు. ఫలితం వచ్చేలోగానే అతడు పారిపోవడంతో అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2020-03-18T07:05:51+05:30 IST