తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు కనోనా బాధితునికి అనుమతి!

ABN , First Publish Date - 2020-03-23T12:43:02+05:30 IST

ఇటలీ నుంచి భారత్ వచ్చిన ఒక యువకుడిని ఐటీబీపీ ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే అతనిలో ఇప్పటివరకూ కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు.

తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు కనోనా బాధితునికి అనుమతి!

న్యూఢిల్లీ: ఇటలీ నుంచి భారత్ వచ్చిన ఒక యువకుడిని ఐటీబీపీ ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే అతనిలో ఇప్పటివరకూ కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. ఇంతలో తండ్రి మృతి చెందినట్టు అతనికి తెలిసింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అ యువకుడు తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. అధికారులు చెప్పినదాని ప్రకారం ఆ యువకునికి ఇప్పటికే రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ యువకునికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.

Updated Date - 2020-03-23T12:43:02+05:30 IST