కరోనా కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పిన బాధితుడు

ABN , First Publish Date - 2020-03-21T16:29:43+05:30 IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు మించిన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరం మొదలైనవి కరోనా...

కరోనా కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పిన బాధితుడు

బీజింగ్: ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు మించిన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరం మొదలైనవి కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. కరోనా వ్యాధికిలోనై దాని నుంచి బయటపడినవారు తమ అనుభవాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారు. కానర్ రీడ్(25) చైనాలోని వుహాన్ లోగల ఒక పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ బారిన పడిన కానర్ తనకు ఎదురైన కష్టాలను తన డైరీలో రాశాడు. వైరస్ ప్రభావానికి లోనైన తాను సైనస్ తరహా నొప్పిని ఎదుర్కొన్నానని, తల నొప్పి తీవ్రంగా వచ్చేదని తెలిపాడు. అలాగే చెవిలో ఎప్పుడూ దురదగా అనిపించేదని, అటువంటప్పుడు ఇయర్‌బడ్స్‌ను ఉపయోగించవద్దని కానర్ బాధితులకు సూచించాడు. కళ్లు ఎప్పుడూ మండుతుండేవని, అప్పుడప్పుడు కళ్ల ముందు మబ్బులు కమ్మేసినట్లు కనిపించేదని తెలిపాడు. ఇదేవిధంగా పలువురు కరోనా బాధితులు తాము తీవ్రమైన తలనొప్పిని ఎదుర్కొన్నామని తెలిపారు.

Updated Date - 2020-03-21T16:29:43+05:30 IST