మమ్మల్ని నీచంగా చూశారు: కనిక కుటుంబ సభ్యులు!

ABN , First Publish Date - 2020-03-23T13:09:39+05:30 IST

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కుటుంబ సభ్యులు వైద్యశాఖ అధికారులపై పలు ఆరోపణలు గుప్పించారు. ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ కనిక మెడికల్ రిపోర్టులో ఆమె వయసు 28 అని రాశారని, నిజానికి ఆమె వయసు...

మమ్మల్ని నీచంగా చూశారు: కనిక కుటుంబ సభ్యులు!

లక్నో: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కుటుంబ సభ్యులు వైద్యశాఖ అధికారులపై పలు ఆరోపణలు గుప్పించారు. ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ కనిక మెడికల్ రిపోర్టులో ఆమె వయసు 28 అని రాశారని, నిజానికి ఆమె వయసు 41 ఏళ్లని తెలిపారు. అలాగే రిపోర్టులో ఆమెను పురుషునిగా పేర్కొన్నారని ఆరోపించారు. దీనికితోడు కనిక వైద్య పరీక్షల రిపోర్టు మీడియా ముందుకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదన్నారు. కరోనా బారిన పడినవారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని, అయితే కనిక వివరాలు ఎందుకు బహిర్గతం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా తాము పలు అవమానాలు గురవుతున్నామని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాగా కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడిన నేపధ్యంలో ఆమెతో టచ్‌లోఉన్న 53 మంది కరోనా అనుమానితులలో 11 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలినవారి రిపోర్టులు ఇంకా రావాల్సివుంది.

Updated Date - 2020-03-23T13:09:39+05:30 IST