గంజికి అనుమతివ్వాలి ముస్లిం లీగ్‌ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-04-15T13:07:50+05:30 IST

గంజికి అనుమతివ్వాలి ముస్లిం లీగ్‌ విజ్ఞప్తి

గంజికి అనుమతివ్వాలి  ముస్లిం లీగ్‌ విజ్ఞప్తి

చెన్నై: రంజాన్‌ మాసం వ్రత దీక్షకు మసీదుల్లో గంజి తయారుచేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఇండియా ముస్లిం లీగ్‌ పార్టీ అధ్యక్షుడు ఖాదర్‌మొహిద్దీన్‌ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇస్లామీయుల సంవత్సరంలో రంజాన్‌ మాసం మొత్తం ముస్లింలు దీక్ష పాటించడం ఆనవాయితీ. అనంతరం పేదలకు ధర్మం చేస్తూ రంజాన్‌ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది రంజాన్‌ మాసం ఈనెల 25న ప్రారంభం కానుంది. ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో వుండడంతో దీక్ష చేపట్టనున్న ముస్లింలకు మసీదుల్లో గంజి కాసి అందజేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్రప్రభుత్వానికి ముస్లిం లీగ్‌ విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2020-04-15T13:07:50+05:30 IST