కరోనా వైరస్ తాజా అప్డేట్.. క్వారంటైన్‌లో సీఆర్‌పీఎఫ్ డీజీ

ABN , First Publish Date - 2020-04-05T22:26:24+05:30 IST

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఉదయం వరకు

కరోనా వైరస్ తాజా అప్డేట్.. క్వారంటైన్‌లో సీఆర్‌పీఎఫ్ డీజీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఉదయం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,374 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. కర్ణాటకలో ఒకరు, తమిళనాడులో ఒకరు కొత్తగా ప్రాణాలు కోల్పోయారు. 


సీఆర్‌పీఎఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఆయనను పరోక్షంగా కలిసిన సీఆర్‌పీఎఫ్ డీజీ మహేశ్వరి పరీక్షల కోసం తమ నమూనాలు అందజేశారు. మరో 20 మంది సీనియర్ భద్రతాధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మొత్తంగా 20 మంది సీఆర్‌పీఎఫ్ అధికారులు గత రెండు రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.


మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలో అత్యధికంగా మూడు లక్షల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఇటలీలో అత్యధికంగా 13 వేల మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-05T22:26:24+05:30 IST