స్థానిక వ్యాప్తే... సామాజిక వ్యాప్తి కాదు

ABN , First Publish Date - 2020-04-01T09:16:37+05:30 IST

భారత్‌లో కరోనావైరస్‌ ‘‘పరిమిత సామాజిక వ్యాప్తి’’ దశకు చేరకుందని వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక కలకలం రేపడంతో కేంద్రం మంగళవారంనాడు దానిపై వివరణ ఇచ్చింది.

స్థానిక వ్యాప్తే... సామాజిక వ్యాప్తి కాదు

న్యూఢిల్లీ, మార్చి 31: భారత్‌లో కరోనావైరస్‌ ‘‘పరిమిత సామాజిక వ్యాప్తి’’ దశకు చేరకుందని వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక కలకలం రేపడంతో కేంద్రం మంగళవారంనాడు దానిపై వివరణ ఇచ్చింది. ఆ పదప్రయోగం సాధారణంగా ప్రభుత్వ నోట్‌లలో వినియోగించేదే (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌లో భాగంగా ఇచ్చినదే) తప్ప అది చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. ‘ప్రస్తుతం వైరస్‌ లోకల్‌ (స్థానిక) వ్యాప్తి దశలో ఉంది తప్ప సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు’ అని వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-01T09:16:37+05:30 IST