కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం

ABN , First Publish Date - 2020-03-14T04:25:18+05:30 IST

వాషింగ్టన్: కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం సంభవించింది. ఢిల్లీలో 69 సంవత్సరాల

కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం

వాషింగ్టన్: కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం సంభవించింది. ఢిల్లీలో 69 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది. ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు. మృతురాలికి గతం నుంచే బీపీ, షుగర్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 80కి పైగా కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకూ ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు నిన్న మృతిచెందారు. 

Updated Date - 2020-03-14T04:25:18+05:30 IST