క‌రోనా క‌ల్లోలం: ఢిల్లీ గ్లోబ‌ల్‌ హాట్‌స్పాట్‌గా మార‌నుందా?

ABN , First Publish Date - 2020-06-25T14:11:19+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఒక్క‌ రోజులో అత్య‌ధికంగా క‌రోనా కొత్తకేసులు న‌మోద‌య్యాయి. ఢిల్లీలో మంగళవారం కొత్త‌గా 3,947 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మ‌న‌దేశంలో....

క‌రోనా క‌ల్లోలం: ఢిల్లీ గ్లోబ‌ల్‌ హాట్‌స్పాట్‌గా మార‌నుందా?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఒక్క‌ రోజులో అత్య‌ధికంగా క‌రోనా కొత్తకేసులు న‌మోద‌య్యాయి. ఢిల్లీలో మంగళవారం కొత్త‌గా 3,947 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మ‌న‌దేశంలో ఇప్పటివరకు అన్ని న‌గ‌రాల‌కు మించి అత్యధికంగా ఇక్క‌డ కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్ 23 న ఢిల్లీలో సావోపాలో (బ్రెజిల్), శాంటియాగో (చిలీ), లిమా (పెరూ) న‌గ‌రాల కంటే అత్య‌ధిక క‌రోనాకేసులను నమోద‌య్యాయి. లాటిన్ అమెరికాలోని ఈ మూడు మెట్రోపాలిటన్ నగరాలు గ్లోబల్ కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. జూన్ 23న న్యూయార్క్, మాస్కోలో న‌మోదైన కొత్త  కేసులకు మించి ఢిల్లీలో కేసులు న‌మోద‌య్యాయి. న్యూయార్క్, మాస్కో మ‌హాన‌గ‌రాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతూ వ‌చ్చాయి. అయితే ఈ నెలలో అక్క‌డ కేసుల న‌మోదులో త‌గ్గుద‌ల చోటుచేసుకుంది. కాగా వారం రోజులుగా ఢిల్లీలో క‌రోనా ప‌రీక్ష‌ల‌ను మ‌రింత‌గా పెంచారు. ఈ నేప‌ధ్యంలోనే కేసుల సంఖ్య పెరిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. 

Updated Date - 2020-06-25T14:11:19+05:30 IST