తగ్గిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-03-25T14:59:26+05:30 IST
ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 560 కు పెరిగింది. వీరిలో 11 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 560 కు పెరిగింది. వీరిలో 11 మంది మరణించారు. కాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్తగా 64 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి, సోమవారం 99 కేసులు నమోదయ్యాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 397 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 64 కొత్త కేసులు నమోదుకాగా, ఎవరూ మృతి చెందలేదు. అయితే తమిళనాడులో బుధవారం ఉదయం ఒకరు మృతి చెందారు. తమిళనాడులో కరోనా వైరస్ కారణంగా ఇది తొలి మృతి కేసు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య 11 కి పెరిగింది.