14రోజుల తర్వాత వైద్యుల సలహాపై కరోనా రోగుల డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-03-16T14:36:59+05:30 IST

కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిన రోగులకు 14 రోజుల పాటు ఐసోలేషన్ గదుల్లో చికిత్స తర్వాత వైద్యుల సలహాపై....

14రోజుల తర్వాత వైద్యుల సలహాపై కరోనా రోగుల డిశ్చార్జ్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టులో వచ్చిన రోగులకు 14 రోజుల పాటు ఐసోలేషన్ గదుల్లో చికిత్స తర్వాత వైద్యుల సలహాపై వారి రక్తనమూనాల పరీక్షించి కరోనా నెగిటివ్ అని వస్తే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 115కు చేరిన నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రోగుల చికిత్స, డిశ్చార్జ్ ల విషయంలో ఓ విధానాన్ని రూపొందించింది. కరోనా రోగులను 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స తర్వాత వారి చెస్ట్ రేడియోగ్రాఫిక్ క్లియరెన్స్, ఊపిరితిత్తులకు శాంపిల్స్ వైరల్ క్లియరెన్స్ తోపాటు రెండు రక్తనమూనాల్లోనూ నెగిటివ్ అని వచ్చాక కరోనా రోగులను ఆసుపత్రుల ఐసోలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు.


మహారాష్ట్రలో 34 మందికి, కేరళలో 24 మందికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13 మందికి కరోనా వైరస్ సోకింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఇండియన్ ఫారెస్ట్ ట్రెయినీ స్పెయిన్ దేశంలో పర్యటించి రాగా, అతనికి కరోనా వైరస్ సోకింది. మిలాన్ నగరం నుంచి 211 మంది విద్యార్థులు, ఇరాన్ నుంచి వచ్చిన 236 మందిని ఛవ్లా, జైసల్మేర్, ఢిల్లీ ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలోని ఆసుపత్రిలో ముగ్గురు కరోనా వైరస్ రోగులు చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో జైపూర్ వైద్యులు చేసిన చికిత్స గురించి విదేశీయులు సైతం ఆరా తీస్తున్నారు.

Updated Date - 2020-03-16T14:36:59+05:30 IST