పంజాబ్‌లో 100కు చేరువైన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-08T03:14:28+05:30 IST
పంజాబ్‌లో కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం పఠాన్‌కోట్, మోగాలో కొత్తగా 8

చండీగఢ్: పంజాబ్‌లో కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం పఠాన్‌కోట్, మోగాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99కి పెరిగింది. మొత్తం 2,559 శాంపిళ్లను పరీక్షించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు తెలిపారు. వీటిలో 2,204 కేసుల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇంకా 256 కేసులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. అలాగే, 79 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు తెలిపారు. 8 మంది మృతి చెందినట్టు పేర్కొన్నారు. కోవిడ్-19 పరీక్షల కోసం 10 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనాలని యోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారిలో 448 మంది పంజాబ్ వచ్చారని, వీరిలో 448 మందిని గుర్తించినట్టు తెలిపారు. వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, 119 మంది పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు వివరించారు.