ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌కు అహ్మ‌దాబాద్‌లో క‌రోనా క‌ట్ట‌డి బాధ్య‌త‌లు!

ABN , First Publish Date - 2020-05-09T12:14:58+05:30 IST

గుజరాత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర‌త‌ కొనసాగుతోంది. ఇక్కడ 7 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అహ్మదాబాద్ గుజరాత్‌లో కరోనా కేంద్రంగా మారింది. ఇక్క‌డ‌ ఇప్పటివరకు 300 మందికి పైగా...

ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌కు అహ్మ‌దాబాద్‌లో క‌రోనా క‌ట్ట‌డి బాధ్య‌త‌లు!

న్యూఢిల్లీ: గుజరాత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర‌త‌ కొనసాగుతోంది. ఇక్కడ 7 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అహ్మదాబాద్ గుజరాత్‌లో కరోనా కేంద్రంగా మారింది. ఇక్క‌డ‌ ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 5200 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌ధ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ మనీష్ సుర్జాలను హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌కు పంపించారు. వీరు సివిల్ హాస్పిటల్ ఎస్వీపీ ఆసుప‌త్రుల‌ను సందర్శించ‌నున్నారు. అలాగే పరిస్థితిని అధిగమించడానికి వైద్యులకు మార్గనిర్దేశం చేయ‌నున్నారు. అమిత్ షా సూచనల మేరకు ఈ వైద్యుల‌ను భారత వైమానిక ద‌ళానికి చెందిన‌ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు తరలించారు. గుజరాత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 390 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్ కేసులు 7,403 కు పెరిగాయి. ఇదిలావుండ‌గా జూన్ నెల‌లో భారతదేశంలో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తె‌లిపారు. లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌ కరోనా కేసులు అంత‌గా పెరగలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-09T12:14:58+05:30 IST