ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2020-06-11T17:13:46+05:30 IST
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు

చెన్నై: విల్లుపురం జిల్లా సెంజి లో టెన్త్ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సెంజికి ఆ విద్యార్థిని అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదువుతూ రెండ్రో జల కిత్రం ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కరోనా లేదనే సర్టిఫికెట్‌ను సమర్పించాలని, లేక పోతే అనుమతించమని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో విద్యార్థిని విల్లుపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థిని ఆరో గ్యంగా ఉన్నప్పటికీ కరోనా లక్షణాలు నిర్ధారణ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో, విద్యార్థిని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి వైద్యపరీక్షలు చేయనున్నారు.