కరోనా నుంచి కోలుకున్న 37 మంది ఖైదీలు
ABN , First Publish Date - 2020-06-11T16:38:11+05:30 IST
కరోనా నుంచి కోలుకున్న 37 మంది ఖైదీలు

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో శిక్ష అనుభవిస్తూ కరోనా సోకి అనారోగ్యం పాలైన 37 మంది ఖైదీలు కోలుకు న్నారని ఆరోగ్య శాఖ, జైలు శాఖలు సంయుక్తంగా ప్రకటించాయి. చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో 28 మంది, కడలూరు కేంద్ర కారాగారంలో నలుగురు, తిరునల్వేలి జిల్లా పాళయంకోట జైలులో ఇద్దరు, తిరుచ్చి జైలులో ఒకరు అని మొత్తం 37 మంది ఖైదీలకు కరోనా సోకడంతో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్సలు అందించారు. ఇందులో పాజిటివ్‌గా గుర్తించి చికిత్సల అనంతరం 37 మంది ఖైదీలు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.