ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థులు... సాయం కోసం ఎదురుచూపు!

ABN , First Publish Date - 2020-03-02T11:52:14+05:30 IST

ఉత్తర ఇటలీలోని పావియా పట్టణంలో వారం రోజులుగా చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ...

ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థులు... సాయం కోసం ఎదురుచూపు!

జైపూర్: ఉత్తర ఇటలీలోని పావియా పట్టణంలో వారం రోజులుగా చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 17 మంది మృతి చెందారు. అక్కడ చిక్కుకున్న భారత విద్యార్థులలో కొందమంది స్వదేశానికి వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కరోనా వైరస్ కొత్త కేసుల కారణంగా, విమానాలను రద్దుచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పావియాలో ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించిన నేపధ్యంలో విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. అలాగే ఇప్పటి వరకూ వర్సిటీకి చెందిన 15 మంది సిబ్బంది వివిధ ఆరోగ్య కేంద్రాలలో ఉంచారు. 


ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు చదువుకున్న బెంగళూరుకు చెందిన అంకిత ఈ సందర్భంగా  మాట్లాడుతూ... మాలో సగంమంది భారత్ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ప్రతీరోజూ విమానాలు రద్దవుతుండటంతో, కొత్త టిక్కెట్ల రేటు మరింత పెరుగుతున్నాయన్నారు. ఆమె ఫోనులో మాట్లాడుతూ ఇక్కడి నిత్యావసర సరుకుల దుకాణాల్లో త్వరగా సరుకులు అమ్ముడయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సహాయం అందించాలని కోరుతున్నారు. పావియా యూనివర్సిలో చదువుతున్న 85 మంది భారత విద్యార్థులలో 25 మంది తెలంగాణ విద్యార్థులు, 20 మంది కర్నాటక, 15 మంది తమిళనాడు, కేరళకు చెందిన నలుగురు, ఢిల్లీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, రాజస్థాన్, గురుగ్రామ్, డెహ్రాడూన్‌కు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు.  వీరిలో 65 మంది ఇంజినీరింగ్ చేస్తున్నారు. 


Updated Date - 2020-03-02T11:52:14+05:30 IST