టీకా రాక అన్నిదేశాలలో ఆకలి చావులు

ABN , First Publish Date - 2020-05-13T22:21:42+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి టీకా తయారీలో దాదాపు వందకుపైగా కంపెనీలు తలమునకలై ఉన్నాయి.

టీకా రాక అన్నిదేశాలలో ఆకలి చావులు

కరోనా వైరస్ కట్టడికి టీకా తయారీలో దాదాపు వందకుపైగా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. అయితే వైరస్ టీకా ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా చెప్పకపోయినా టీకా సురక్షితమని లండన్‌కు చెందిన వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏ టీకా కూడా ఏడాది, ఏడాదిన్నరలోపు పూర్తిగా అభివృద్ది చేయలేమంటున్నారు. లాక్ డౌన్‌ను ఎత్తివేయకపోతే అనేక దేశాల్లో ఆకలి చావులు చూడాల్సి వస్తుందని, కరోనా వైరస్‌కు అసలు టీకా అనేది రాకపోతే, ప్లాన్ ‘బి’ను అమలు చేయడానికి ప్రభుత్వాలు సిద్దంగా ఉండాలని చరిత్ర చెబుతోంది. 


గతంలో వెలుగు చూసిన ఎన్నో వైరస్‌లకు టీకాలు రాలేదు. అయినా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో వాటికి అడ్డుకట్ట వేశారని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఎక్కడా జీవనయానం నిలిచిపోలేదని అన్నారు. అయితే వీటన్నింటికంటే కరోనా భిన్నమైందని, ఒకవేళ దీనికి టీకా అందుబాటులోకి రాకపోతే జీవన విధానం గతంలో మాదిరిగా ఉండే అవకాశం లేదంటున్నారు. కరోనా వైరస్ పరీక్షలు, క్వారంటైన్లు, ఐసోలేషన్లు మానవ జీవితంలో భాగమైపోతాయని చెబుతున్నారు.

Read more