వదలని వైరస్

ABN , First Publish Date - 2020-05-13T12:31:00+05:30 IST

రాష్ట్రాని కరోనా వైరస్‌ వదలడం లేదు. రరోఒఒజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

వదలని వైరస్

కొత్త కేసులు 716

చెన్నైలోనే 510..ఒకేరోజు 8 మరణాలు


చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాని కరోనా వైరస్‌ వదలడం లేదు. రరోఒఒజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 716 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారించారు. వాటిలో 510 కేసులు చెన్నైలోనే నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,718కి, చెన్నైలో 4,882కి పెరిగింది. కొత్త కేసుల్లో చెన్నై తరువాత అరియలూరులో 36, చెంగల్పట్టులో 35, తిరువళ్లూరులో 27, తిరువణ్ణామలైలో 13 ఉన్నాయి. కాగా ఇప్పటివరకు లేని విధంగా మంగళవారం ఒక్కరోజే 8 మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 61కి పెరిగింది. మరో 83 మంది డిశ్చార్జి కావడంతో, రాష్ట్రంలో కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,134కి పెరిగింది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా 2,55,584 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేయగా, 2,66,687 నమూనాలను పరీక్షించారు. మంగళవారం ఒక్కరోజే 11,788 నమూనాలను పరీక్షిం చినట్టు  వైద్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా సమూహ వ్యాప్తి మొదలైందా అన్న విషయంపై అధ్యయనం చేయాలని కేంద్ర వైద్య బృందం నిర్ణయించింది. తమిళనాడులో చెన్నై, తిరువణ్ణామలై, కోవై నగరాల్లో ఆ బృందం పర్యటించి, అధ్యయనం చేపట్టనుందని సమాచారం.

Updated Date - 2020-05-13T12:31:00+05:30 IST