‘కరోనా’ ప్రభావంతో పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2020-03-19T17:05:16+05:30 IST

‘కరోనా’ ప్రభావంతో పలు రైళ్ల రద్దు

‘కరోనా’ ప్రభావంతో పలు రైళ్ల రద్దు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పరిగణలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ఈ నెలాఖరులోపు నడిచే పలు రైళ్లు రద్దు చేసింది.

నెం.22205 డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - మదురై ఏసీ దురంతో బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను మార్చి 23, 25, 30 తేదీల్లో రద్దు చేశారు.


నెం.22206 మదురై - డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఏసీ దురంతో బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను మార్చి 24, 26, 31 తేదీల్లో రద్దు చేశారు.


నెం.22207 డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - తిరువనంతపురం ఏసీ బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను 

మార్చి 20, 24, 27, 31 తేదీల్లో రద్దు చేశారు.


నెం.22208 తిరువనంతపురం - డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఏసీ బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను 

మార్చి 22, 25, 29, ఏప్రిల్‌ 1 తేదీల్లో రద్దు చేశారు.


నెం. 22636 మంగళూరు సెంట్రల్‌ - మడగావ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 

మార్చి 19 నుంచి 31 వరకు రద్దు చేశారు.


నెం. 22635 మడగావ్‌ - మంగళూరు సెంట్రల్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 

మార్చి 19 నుంచి 31 వరకు రద్దు చేశారు.


నెం.06059 డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - సికింద్రాబాద్‌ బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను 

మార్చి 20, 22 తేదీల్లో రద్దు చేశారు.


నెం.06060 సికింద్రాబాద్‌ - డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ బై వీక్లీ ఎక్ర్‌ప్రెస్‌ను 

మార్చి 21, 23 తేదీల్లో రద్దు చేశారు.


నెం.06015 ఎర్నాకుళం జంక్షన్‌ - వేలాంకన్ని వీక్లీ ప్రత్యేక రైలును మార్చి 21న రద్దు చేశారు.


నెం.06016 వేలాంకన్ని - ఎర్నాకుళం జంక్షన్‌ వీక్లీ ప్రత్యేక రైలును మార్చి 22న రద్దు చేశారు.

Updated Date - 2020-03-19T17:05:16+05:30 IST