మళ్లీ పెరుగుతున్నాయ్‌..!

ABN , First Publish Date - 2020-08-22T14:38:08+05:30 IST

మళ్లీ పెరుగుతున్నాయ్‌..!

మళ్లీ పెరుగుతున్నాయ్‌..!

5,995 మందికి పాజిటివ్‌

5764మంది డిశ్చార్జి 

రాష్ట్రంలో101 మంది మృతి 

చెన్నైలో 1282 కేసులు 


 చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శుక్రవారం మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 5986 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడగా శుక్రవారం ఆ సంఖ్య 5995కు పెరిగింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,67,430కి పెరిగింది. చెన్నై లోనూ వైరస్‌ వ్యాప్తి పెరుగు తోంది. తాజాగా 1282 మందికి పాజి టివ్‌ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,757కు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 101మంది మృతి చెందారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స  పొందుతున్న కరోనా బాధితుల్లో 5764 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన 5995 కేసుల్లో 5,963 మంది మాత్రమే రాష్ట్రానికి చెందినవారున్నారు. తక్కిన 32 కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినవారికి వైద్య పరీక్షలు చేయించగా నమోదై నవి.  రాష్ట్రంలోని 62 ప్రభుత్వ, 73 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ప్రయోగశాలల్లో శుక్రవారం 74,344 మందికి  కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.   

Updated Date - 2020-08-22T14:38:08+05:30 IST