అంతుచిక్కడం లేదు..!

ABN , First Publish Date - 2020-08-20T14:28:22+05:30 IST

అంతుచిక్కడం లేదు..!

అంతుచిక్కడం లేదు..!

రాష్ట్రంలో కొత్తగా 5,795 మందికి పాజిటివ్‌

 6387 మంది డిశ్చార్జి 

 116 మంది మృతి..చెన్నైలోనే 1186  కేసులు


 చెన్నై, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎలా పెరుగుతుందో అంతుచిక్కడం లేదు. ఒక్కో రోజు భారీగా పెరుగుతున్న కేసులు మరో రోజు కాస్త తగ్గుతున్నాయని ఆనందపడేలోగా పెరిగిపోతున్నా యి. ఒక్కోరోజు భారీగా పాజిటివ్‌లు నమోదు కాగా, అంతే స్థాయిలో డిశ్చార్జి శాతం కూడా ఉంది. గత కొద్ది రోజులు గా ఐదు వేల కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్పటికీ కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా కాస్త పెరుగుతుండటం వైద్యశాఖ అధికారులకు ఊరట కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5795 మందికి పాజిటివ్‌ రావడంతో మొత్తం కరోనా బాఽధితుల సంఖ్య 3,55,449కి పెరిగింది.  రాజధాని నగరం చెన్నై లో 1186 మందికి పాజిటివ్‌  నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,267కు చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 116మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 6123కు పెరిగింది. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 6384 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్‌ అయిన బాధితుల సంఖ్య 2,96,171కు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన 5795పాజిటివ్‌ కేసులలో 5,785 కేసులు మాత్రమే రాష్ట్రానికి చెందినవి. తక్కిన 10 కేసులు కర్నాటక (3), పశ్చిమబెంగాల్‌ (3), కేరళ (1) మహారాష్ట్ర (1), గుజరాత్‌ (1), ఓమన్‌ (1) తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వైద్య పరీక్షలు జరిపినప్పుడు బయటపడిన కేసులు. రాష్ట్రంలోని 62 ప్రభుత్వ, 73 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ప్రయోగశాలల్లో బుధవారం 67,720 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు.  


Updated Date - 2020-08-20T14:28:22+05:30 IST