తగ్గుముఖం పట్టేదెప్పుడు?

ABN , First Publish Date - 2020-08-18T13:02:37+05:30 IST

తగ్గుముఖం పట్టేదెప్పుడు?

తగ్గుముఖం పట్టేదెప్పుడు?

తాజాగా 5,890 మందికి పాజిటివ్‌ 

120 మంది మృతి - 5,667మంది డిశ్చార్జి

చెన్నైలో 1185 కేసులు నమోదు


చెన్నై, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా ఉంటోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎప్పటివలెనే ఆరువేలకు చేరువగానే నమోదైంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 5890 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో మొత్తం కరోనా బాఽధితుల సంఖ్య 3,43,945కు పెరిగాయి.  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులలో 120 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 5886కు పెరిగింది.  రాజధాని నగరం చెన్నైలో 1185 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీనితో  నగరంలోమొత్తం కేసుల సంఖ్య 1,117,839కి చేరింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా బాధితుల్లో 5667 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకూ డిశ్చార్జ్‌ అయిన బాధితుల సంఖ్య 2,83,937కు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన 5890 పాజిటివ్‌ కేసులలో 5,870 కేసులు మాత్రమే రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. తక్కిన 20 కేసులు  కేరళ (3),  బీహార్‌ (2), కర్నాటక (1), మహారాష్ట్ర (1), పుదుచ్చేరి (1), జార్ఖండ్‌ (1) త్రిపుర (1), రాజస్థాన్‌ (1) సౌదీ అరేబియా (8), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (1)   తదితర ప్రాంతాల నుండి వచ్చినవారికి వైద్య పరీక్షలు జరిపినప్పుడు బయటపడిన పాజిటివ్‌ కేసులుగా ఉన్నాయి.  రాష్ట్రంలోని 62 ప్రభుత్వ ఆసుపత్రులు, 73 ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ప్రయోగశాలల్లో సోమవారం 67,532 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు.  

Updated Date - 2020-08-18T13:02:37+05:30 IST