కరోనా టీకా వేశాక ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యూఆర్ కోడ్!

ABN , First Publish Date - 2020-12-19T17:19:59+05:30 IST

దేశంలోని గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయిలో కరోనా టీకాకరణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి....

కరోనా టీకా వేశాక ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యూఆర్ కోడ్!

న్యూఢిల్లీ: దేశంలోని గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయిలో కరోనా టీకాకరణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ అందించనుంది. ఈ సర్టిఫికెట్‌లో టీకా వేయించుకున్న వ్యక్తితో అనుసంధానించేలా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిలో టీకాకు సంబంధించిన వివరాలు భద్రంగా ఉంటాయి. ఇంతేకాదు ఈ సర్టిఫికెట్‌పై టీకా వేయించుకున్న వ్యక్తి ఫోటో కూడా ఉంటుంది.


అలాగే టీకా వేయించుకున్న తరువాత వారి ఫోను నంబరుకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. దానిలో టీకా ఎప్పుడు వేయించుకున్నారనే వివరాలు ఉంటాయి. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ సర్టిఫికెట్‌పై టీకా బ్యాచ్ నంబర్ కూడా ఉంటుందన్నారు. ఈ సర్టిఫికెట్ డిజిటలైజ్డ్ అయి ఉంటుందని, దానిలో టీకా వేయించుకున్న వ్యక్తి పుట్టిన తేదీ, ప్రస్తుత చిరునామా కూడా ఉంటాయన్నారు. 

Updated Date - 2020-12-19T17:19:59+05:30 IST