‘ఆయుష్మాన్‌’ రేటుకు కరోనా చికిత్సలు చేస్తారా?: సుప్రీం

ABN , First Publish Date - 2020-06-06T07:30:56+05:30 IST

‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో పేర్కొన్న రేట్లకు కరోనా వైరస్‌ రోగులకు చికిత్స చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు

‘ఆయుష్మాన్‌’ రేటుకు కరోనా చికిత్సలు చేస్తారా?: సుప్రీం

న్యూఢిల్లీ, జూన్‌ 5: ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో పేర్కొన్న రేట్లకు కరోనా వైరస్‌ రోగులకు చికిత్స చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు అడిగింది. నిర్ణీత సంఖ్యలో కొవిడ్‌ రోగులకు ఉచితంగా వైద్యం చేయాలని గతంలో తాము చేసిన ప్రతిపాదన నామమాత్రపు ధరలకు ప్రభుత్వ భూములను తీసుకున్న ఆస్పత్రులను ఉద్దేశించినదని ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. అలాంటి ఆస్పత్రులు ఎంతోకొంత సామాజిక సేవ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి భూమి తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన సామాజిక సేవ నిబంధనలను పాటిస్తున్నాయని ఆసుపత్రుల సంఘాలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ప్రైవేటు ఆస్పత్రుల లాభదాయకతను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ రేట్లను ఖరారు చేసిందని సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్‌ తీసుకొచ్చారు. దానిపై ఆస్పత్రుల అభిపాయ్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. 

Updated Date - 2020-06-06T07:30:56+05:30 IST